తెలుగువారిలో స్వాతంత్య్ర కాంక్ష రగిలించిన నేతల్లో టంగుటూరి ప్రకాశం పంతులు అగ్రగణ్యులని.. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన జయంతి సందర్భంగా దేశానికి ప్రకాశం పంతులు అందించిన సేవలప స్మరించుకున్నారు. ప్రజలను ప్రేమించని వాడు దేశభక్తుడు కాదన్న ప్రకాశం... ఆఖరి శ్వాస వరకు నిస్వార్థంగా జీవించారని కొనియాడారు. స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటీష్ తుపాకులకు ఎదురొడ్డి నిలిచిన ధీరోదాత్తుడు.. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరికి నివాళులర్పిస్తున్నట్లు లోకేశ్ తెలిపారు.
స్వాతంత్య్ర పోరాటంలో టంగుటూరి అగ్రగణ్యుడు: చంద్రబాబు - చంద్రబాబు
ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా.. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆయనను స్మరించుకున్నారు. ఆఖరి శ్వాస వరకు నిస్వార్థంగా జీవించారనీ.. ఆయన మార్గం అనుసరణీయమని కొనియాడారు.
స్వాతంత్ర్య పోరాటంలో టంగుటూరి అగ్రగణ్యులు: చంద్రబాబు