ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా రెండున్నర లక్షల మాస్కుల పంపిణీ చేసినట్టు తెదేపా అధినేత చంద్రబాబు వివరించారు. పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తాము చేస్తున్న సేవా కార్యక్రమాలను చంద్రబాబుకు వివరించారు. సరకుల పంపిణీలో అధికారులతో సమన్వయం చేసుకోవాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. గత పాలకులను ప్రజల్లో కించపర్చాలనే యోచన దుర్మార్గమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇలాంటప్పుడు అన్న క్యాంటీన్లు, ఆర్టీజీఎస్ ఉంటే ఎంతో ఉపయోగపడేవని పేర్కొన్నారు. పంటకు ధరలేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
'అన్న క్యాంటీన్లు, ఆర్టీజీఎస్ ఉంటే ఎంతో ఉపయోగపడేవి' - చంద్రబాబు తాజా వార్తలు
పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గత పాలకులను ప్రజల్లో కించపర్చాలనే యోచన దుర్మార్గమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇలాంటప్పుడు అన్న క్యాంటీన్లు, ఆర్టీజీఎస్ ఉంటే ఎంతో ఉపయోగపడేవని పేర్కొన్నారు.
చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్