'ప్రజలు అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధితో పాటు అమరావతిని ఏకైక రాజధానిగా కోరుకుంటున్నారా?' అనే ప్రశ్నను సంధిస్తూ... తెదేపా అధినేత చంద్రబాబు తీసుకొచ్చిన వెబ్ సైట్లో 3లక్షల మందికి పైగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 93శాతం మందికి పైగా ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ప్రజాభిప్రాయం కోరుదామని తాను విసిరిన సవాల్‌ను ప్రభుత్వం స్వీకరించకపోవటంతో... ఆయన http://www.apwithamaravati.com/ వెబ్ సైటు ద్వారా ప్రజాభిప్రాయాన్ని కోరారు. ఈ వెబ్ సైట్ ద్వారా ఓటు వేసి అమరావతిని రక్షించుకోండని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. అయితే 36గంటల వ్యవధిలో 3లక్షల మందికి పైగా ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి ఈ ఓటింగ్‌లో పాల్గొన్నారు.