ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'త్వరలోనే జగన్​ నివాసానికి శాశ్వత కంచె' - మందడం రైతుల ధర్నాకు చంద్రబాబు మద్దతు

త్వరలోనే ముఖ్యమంత్రి జగన్ నివాసానికి శాశ్వతంగా కంచె వేసుకునే పరిస్థితి వస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. అమరావతిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.

chandrababu supports mandadam farmers
మందడంలో మాట్లాడుతున్న చంద్రబాబు

By

Published : Jan 1, 2020, 5:32 PM IST

Updated : Jan 1, 2020, 7:46 PM IST

తెదేపా అధినేత చంద్రబాబు.. అమరావతి రైతులకు సంఘీభావం తెలిపారు. వారు చేస్తున్న దీక్షా శిబిరాలకు వెళ్లి.. రైతులకు ధైర్యం చెప్పారు. కృష్ణరాయపాలెంలో రైతులను కలిశారు. త్వరలోనే ముఖ్యమంత్రి జగన్ నివాసానికి శాశ్వతంగా కంచె వేసుకునే పరిస్థితి వస్తుందని అన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కు, తనకు ప్రజలే పోలీసులని... తమకు పోలీసులు అవసరం లేదని వ్యాఖ్యానించారు. అమరావతి కోసం అందరి దేవుళ్ల దీవెనలు తీసుకున్నామని అన్నారు. రాజధానిలో 75 శాతం బడుగు బలహీన వర్గాలు ఉన్నాయని.. హైదరాబాద్‌కు దీటుగా మరో నగరం ఉండాలన్న లక్ష్యంతోనే అమరావతికి శ్రీకారం చుట్టామని స్పష్టం చేశారు. అంతా కలిసి అమరావతిని కాపాడుకుందామని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చెప్పారు.

మందడంలో మాట్లాడుతున్న చంద్రబాబు
Last Updated : Jan 1, 2020, 7:46 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details