దేశంలో కరోనా శరవేగంతో విస్తరిస్తూ ప్రమాదకారిగా మారుతున్నందున.. మనల్ని మనమే రక్షించుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ప్రజలకు సూచించారు. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో మహమ్మారి నుంచి రక్షణ పొందడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ మూడు సూచనలు చేసినట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఇదీ చదవండి:కరోనాతో భర్త మృతి.. భార్య, కొడుకు ఆత్మహత్య
ఏసీ గదులలో కంటే గాలి, వెలుతురు బాగా ఉన్న బహిరంగ ప్రదేశాల్లో ఉండటం శ్రేయస్కరమని డబ్ల్యూహెచ్వో చెప్పిందని చంద్రబాబు అన్నారు. వీలైనంత వరకు ఇతరులకు దూరంగా ఉండమని పేర్కొందని చెప్పారు. ఎవరినైనా కలవాల్సి వస్తే వారితో సాధ్యమైనంత తక్కువ సమయం గడిపితే మంచిదని సూచించినట్లు తెలుగు ప్రజలంతా ఈ మూడింటినీ పాటించి.. కొవిడ్ నుంచి వీలైనంత రక్షణ పొందాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి:'ప్రభుత్వ నిర్లక్ష్యమే ఉద్యోగుల మృతికి కారణం'