పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనని వారు పనితీరు మార్చుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హెచ్చరించారు. నియోజకవర్గ ఇంచార్జ్‌లు నాయకులందరినీ కలుపుకొని వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఏకపక్షంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం 59 మంది ఇంచార్జ్‌లతో చంద్రబాబు ముఖాముఖి భేటీ నిర్వహించి వివిధ అంశాలపై చర్చించారు. సార్వత్రిక ఎన్నికలకు సిద్దంగా ఉన్నారా లేక ప్రత్యామ్నాయాలు చూసుకోవాలా అంటూ నియోజకవర్గ ఇంఛార్జ్‌లను.. చంద్రబాబు ప్రశ్నించారు.
ఇంఛార్జిలతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్న అధినేత.., పార్టీ చేపడుతున్న కార్యక్రమాల పై ఆరా తీశారు. నాయకుల పనితీరుపై సమగ్ర సమాచారంతో వివిధ అంశాలపై లోతుగా సమీక్షించారు. పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనని వారు పనితీరు మార్చులకోవాలని హెచ్చరించారు. అంతర్గత నివేదికల ఆధారంగా నేతల పనితీరును విశ్లేషించి.., బాగా పనిచేస్తున్న వారిని అభినందించారు.