ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వల్లభనేని వంశీ లేఖపై చంద్రబాబు ఏమన్నారంటే..! - వంశీ లేఖపై చంద్రబాబు స్పందన వార్తలు

తెదేపాకు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామాపై.. పార్టీ అధినేత చంద్రబాబు స్పందించారు. స్థానిక వైకాపా నేతల కక్ష సాధింపు  వల్లే రాజీనామా చేస్తున్నట్లు వంశీ పేర్కొన్నారని అన్నారు. రాజీనామాతో సమస్యలకు పరిష్కారం దొరకదని అభిప్రాయపడ్డారు.

chandrababu react on vallabaneni vamshi resgin letter

By

Published : Oct 27, 2019, 8:15 PM IST

Updated : Oct 27, 2019, 11:31 PM IST

వల్లభనేని వంశీ రాజీనామా లేఖపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. వాట్సాప్ ద్వారా వంశీ లేఖ అందిందని తెలిపారు. స్థానిక వైకాపా నేతల కక్ష సాధింపు వల్లే వంశీ రాజీనామా చేస్తున్నట్లు చెప్పారని అన్నారు.

వంశీ రాజీనామాపై చంద్రబాబు స్పందన

రాజీనామా చేయడం, రాజకీయాల నుంచి వైదొలగడం సమస్యకు పరిష్కారం కాదు. అప్రజాస్వామిక విధానాలపై కలిసికట్టుగా పోరాడాలి. అలా చేయటం మన బాధ్యతగా గుర్తించాలి . వ్యక్తిగతంగా, పార్టీ పరంగా వంశీ వెనక నేనుంటాననే హామీ ఇస్తున్నాను . కేడర్​కు అన్యాయం జరగకుండా ఎందాకైనా పోరాడేందుకు సిద్ధం. ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పోరాడుతూ ముందుకు వెళ్దాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా నాయకులపై జరుగుతున్న కక్షసాధింపులపై వివిధ రూపాల్లో పోరాటం చేస్తున్నాం. అనైతిక చర్యలకు ముగింపు పలికే వరకు దీనిని కొనసాగిద్దాం.

- చంద్రబాబు నాయుడు, తెదేపా అధినేత

ఇదీ చదవండి:

రాజకీయాల నుంచి వైదొలుగుతున్నా: వల్లభనేని వంశీ

Last Updated : Oct 27, 2019, 11:31 PM IST

ABOUT THE AUTHOR

...view details