దేశ సరిహద్దు రక్షణలో భాగంగా లడఖ్ గాల్వన్లో చైనా బలగాల దాడుల్లో అమరులైన 20 మంది భారత సైనికులకు.. తెదేపా అధినేత చంద్రబాబు నివాళి అర్పించారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన భరతమాత ముద్దు బిడ్డలకు జోహార్లు తెలిపారు. దేశ భద్రత కోసం వారు ప్రాణాలను తృణప్రాయంగా భావించారని కొనియాడారు. అలాంటి వీరులను కన్న తల్లిదండ్రులకు శిరసు వంచి నమస్కారాలు చేస్తున్నానన్నారు. వారి ధైర్యసాహసాలే మనకు స్ఫూర్తిదాయకాలని స్పష్టంచేశారు.
'దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన జవాన్లకు వందనాలు' - లడఖ్ వీర జవాన్లకు చంద్రబాబు నివాళి
దేశ సరిహద్దు రక్షణలో భాగంగా లడఖ్ గాల్వన్లో చైనా బలగాల దాడుల్లో అమరులైన జవాన్లకు తెదేపా అధినేత చంద్రబాబు నివాళి అర్పించారు. దేశ భద్రత కోసం వారు ప్రాణాలను తృణప్రాయంగా భావించారని కొనియాడారు.
చంద్రబాబు