వైకాపా తీరుతో రాష్ట్రానికి చెడ్డపేరు వచ్చి యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోతోందని... తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 11.8% శాతంతో అత్యధిక పెట్టుబడులు ఆకర్షించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిపామని గుర్తుచేశారు. గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 7లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తే... అందులో రాష్ట్రానికి 70వేల కోట్లు వచ్చాయని వివరించారు. అందుకు ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన బులిటెన్ సాక్ష్యమంటూ ఆ వివరాలను తన ట్విట్టర్ ఖాతాలో చంద్రబాబు పోస్ట్ చేశారు.
'వాటాల కోసం బెదిరింపులు... డీలర్‌షిప్‌ల కోసం వేధింపులు' - వైకాపా పై చంద్రబాబు ఫైర్ వార్తలు
అధికార వైకాపాపై తెదేపా అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. వైకాపా తీరుతో రాష్ట్రానికి చెడ్డపేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది మంది యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోతుందని ట్వీట్టర్ వేదికగా ధ్వజమెత్తారు.
తెదేపా హయాంలో పెట్టుబడుల ఆకర్షణలో మహారాష్ట్ర, గుజరాత్‌తో పోటీపడ్డామన్న చంద్రబాబు... వైకాపా ప్రభుత్వంలో పీపీఏల రద్దు, వాటాల కోసం బెదిరింపులు, డీలర్‌షిప్‌ల కోసం వేధింపులు తట్టుకోలేక... 9 నెలల్లోనే లక్షా 80 వేల కోట్ల పెట్టుబడులు వెనక్కిపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల దావోస్‌లోనూ పారిశ్రామికవేత్తలు ఏపీలో గత 9 నెలల రివర్స్‌పాలనపై ఆందోళన వ్యక్తం చేశారంటూ విమర్శించారు. వైకాపా ప్రభుత్వం ఇకనైనా రాష్ట్రాభివృద్ది, భావితరాల భవిష్యత్తుపై దృష్టి సారించాలని హితవు పలికారు.
ఇదీ చదవండి : 2018-19లో అత్యధిక ప్రైవేటు పెట్టుబడులు రాష్ట్రానికే