రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాల పంపిణీ కోసం భూములు చదును చేయడం సరికాదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రాజధానికి ఇచ్చిన భూముల్లో ఇతరులకు పట్టాలు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. మందడం, ఐనవోలులో రాత్రిపూట భూమి చదును చేయడం, అరెస్టుల పేరుతో బెదిరించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు పట్టాలు ఇవ్వాలంటే భూములు కొని ఇవ్వాలని సూచించారు. పేదలు, రైతుల మధ్య విద్వేషాలు రేపడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. పేదల అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కుంటున్నారని ఆరోపించారు.
రాజధాని భూముల్లో ఇతరులకు పట్టాలివ్వడమేంటి? - ఉగాది ఇళ్ల పట్టాల పంపిణీ వార్తలు
రాజధానికి ఇచ్చిన భూముల్లో ఇతరులకు పట్టాలు ఇవ్వడం సరికాదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రాత్రివేళల్లో భూములను చదును చేయడం, అరెస్టుల పేరుతో రైతులను బెదిరించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
chandrababu react on capital lands are flattened for the distribution of houses