రాష్ట్రంలో ఇసుక కొరతతో35లక్షల మంది కార్మికులు రోడ్డునపడినా...ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు.వరదల పేరుతో ప్రభుత్వం తప్పించుకుంటోందని ఆయన విమర్శించారు.ప్రతిరోజూ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మంత్రులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. విజయవాడలో తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల పరిశీలకులకు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో చంద్రబాబు పాల్గొన్నారు.
పాలించే వ్యక్తి మారితే రాష్ట్రం ఎలా అధోగతి పాలవుతుందో చెప్పేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచిందని చంద్రబాబు దుయ్యబట్టారు.ఉద్యోగులను భయబ్రాంతులకు గురిచేసేందుకే ఎల్వీ సుబ్రమణ్యాన్ని ఆకస్మికంగా బదిలీ చేశారన్నారు.