కొవిడ్ బారిన పడిన జూనియర్ ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కొవిడ్ని త్వరగా జయించి రావాలని ట్విట్టర్లో ఆయన ఆకాంక్షించారు. తాను కరోనా బారిన పడినట్టు జూనియర్ ఎన్టీఆర్ ట్విటర్ ద్వారా తెలిపారు. ఈ నేపథ్యంలో.. చంద్రబాబు స్పందించారు.
కోవిడ్ నుంచి జూ.ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు. కరోనాను జయించి తన కుటుంబసభ్యుల్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఆయన సూచించారు.