ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రజల కోసం పోరాడిన వ్యక్తి కోడెల : చంద్రబాబు - వైసీపీపై చంద్రబాబు కామెంట్స్

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు జయంతి పురస్కరించుకుని ఆయన సేవలను తెదేపా అధినేత చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. పేదలకు రూపాయికే వైద్యం అందించిన వ్యక్తిత్వం ఆయనది చంద్రబాబు అన్నారు. కోడెల ఆపన్నులకు అండగా నిలిచినందుకు ప్రజల్లో పల్నాటి పులిగా నిలిచారన్నారు.

చంద్రబాబు
చంద్రబాబు

By

Published : May 2, 2020, 10:18 AM IST

చంద్రబాబు ట్వీట్

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు జయంతి సందర్భంగా ఆయన సేవలను మననం చేసుకుందామని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. కోడెల శివప్రసాదరావుది ప్రజల కోసం పోరాడే వ్యక్తిత్వమని చంద్రబాబు అన్నారు. ఆపన్నులకు అండగా నిలిచి భరోసా ఇచ్చే గుండె ధైర్యం కోడెల సొంతమన్న చంద్రబాబు... కోడెల రూపాయి డాక్టరుగా పేదలకు వైద్య సేవలందించారని గుర్తుచేశారు. కోడెల సేవలను చూసే ఎన్టీఆర్ ఆయనను రాజకీయాల్లోకి ఆహ్వానించారన్నారు. ప్రజల్లో కోడెలను పల్నాటి పులిగా నిలిపాయన్నారు. కోడెల కుటుంబంపై 19 కేసులు పెట్టి వైకాపా నేతలు కాకుల్లా పొడుచుకుతిన్నారని చంద్రబాబు ఆరోపించారు. మానసికంగా కృంగదీసి ఆత్మహత్యకు పాల్పడేలా చేశారన్నారు. వైకాపా క్రూర రాజకీయానికి కోడెల మృతి ఒక ఉదాహరణ అని చంద్రబాబు మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details