ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

న్యాయవిచారణతోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి: చంద్రబాబు - అమరావతిపై చంద్రబాబు కామెంట్స్

అమరావతి, విశాఖలో భూ ఆరోపణలపై వాస్తవాలు వెలుగులోకి రావాలంటే న్యాయవిచారణ జరపాలని... తెదేపా అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పోలీస్ అధికారులతో వేసిన సిట్ వల్ల వాస్తవాలు బయటికి రావని ట్వీట్ చేశారు.

వాస్తవాలు న్యాయవిచారణతోనే సాధ్యం: చంద్రబాబు
వాస్తవాలు న్యాయవిచారణతోనే సాధ్యం: చంద్రబాబు

By

Published : Feb 22, 2020, 10:41 PM IST

వాస్తవాలు న్యాయవిచారణతోనే సాధ్యం: చంద్రబాబు

అమరావతి, విశాఖలో భూముల వ్యవహారం వాస్తవాలు వెలుగులోకి రావాలనే ఉద్దేశమే జగన్ ప్రభుత్వానికి ఉంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ నియమించే జుడీషియల్ విచారణ ద్వారానే సాధ్యమని... మీ పోలీస్ అధికారులతో వేసిన సిట్-స్టాండ్ కమిటీల వల్ల వాస్తవాలు బయటికి రావని ప్రజలు భావిస్తున్నారు. మీ సొంత బాబాయి హత్యపై వేసిన సిట్​లోని వ్యక్తులను మార్చి మరొక సిట్ వేశారు. ఆ సిట్ పై నమ్మకం లేదని, సీబీఐ విచారణ కావాలని మీ సోదరి డా.సునీత హైకోర్టుకు విన్నవించుకున్నారు. అదేవిధంగా విశాఖ భూములపై సిట్ నివేదికను పక్కన పెట్టి, మరొక సిట్ వేసి వాస్తవాలను తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారని అందరికీ తెలుసు. రాజకీయ ప్రత్యర్థులను, అధికారుల్ని బెదిరించడానికి, బ్లాక్ మెయిల్ చేయడానికి, వేధించడానికే సిట్-స్టాండ్ కమిటీల ఏర్పాటు అని స్పష్టమవుతోంది. నిర్ధిష్ట అంశాలపైన జుడీషియల్ విచారణ జరిపితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.

- తెదేపా అధినేత చంద్రబాబు

వాస్తవాలు న్యాయవిచారణతోనే సాధ్యం: చంద్రబాబు

ఇదీ చదవండి: తెదేపానే కాదు.. ఏపీని టార్గెట్ చేశారు: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details