'కక్ష కట్టి... క్షోభ పెట్టి కడతేర్చారు... ' - undefined
పల్నాటి పులి లాంటి వ్యక్తిని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా వేధించారని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, స్పీకర్‌గా పనిచేసిన వ్యక్తికి ఇలాంటి మరణం బాధాకరమన్నారు.
పల్నాటి పులి లాంటి వ్యక్తిని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా వేధించారని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, స్పీకర్‌గా పనిచేసిన వ్యక్తికి ఇలాంటి మరణం బాధాకరమన్నారు. తప్పుచేసి జీవితం ముగిసిపోతే మనం అర్థం చేసుకోవచ్చన్న చంద్రబాబు.... వేధించి, హింసించడం వల్ల మనిషి చనిపోతే ఏమనాలని ప్రశ్నించారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తిపై లక్ష రూపాయల విలువైన ఫర్నీచర్ కోసం రాద్దాంతం చేశారన్నారు. లక్ష రూపాయల కేసులో కోడెల ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చారని చంద్రబాబు అన్నారు. కోడెలపై 2 నెలల్లోనే 19 కేసులు నమోదు చేశారంటేనే... ఎంత కక్షగట్టారో అర్ధం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. కోడెలకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయండని విజయసాయిరెడ్డి పోస్టులు పెట్టారని చంద్రబాబు... పదేపదే కోడెలను విమర్శించి ఆయనపై ఓ ముద్ర వేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
TAGGED:
chandrababu on kodela death