ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నాడు దూరదృష్టితో చేపట్టిన ప్రాజెక్ట్ జీనోమ్ వ్యాలీ: చంద్రబాబు - భారత్ బయోటెక్ క్లినికల్ ట్రయల్స్ వార్తలు

కొవిడ్ వ్యాక్సిన్ పై భారత్ బయోటెక్ చేస్తున్న ప్రయత్నాలన్నీ విజయవంతం కావాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. నాడు తెదేపా హయాంలో చేపట్టిన ప్రత్యేక జీనోమ్ వ్యాలీ... నేడు వ్యాక్సిన్ తయారీ ప్రక్రియలో ముందు వరుసలో నిలిచిందని ట్వీట్ చేశారు.

cbn
cbn

By

Published : Nov 27, 2020, 8:22 PM IST

కొవిడ్ వ్యాక్సిన్ తయారీలో భారత్ బయోటెక్ విధానాలు భవిష్యత్తు రుజువులని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. కొవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి సమీక్షకు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ లోని జినోమ్ వ్యాలీ సందర్శనపై చంద్రబాబు ట్విట్టర్ లో స్పందించారు.

"బయోటెక్ గురించి ఎక్కడా వినిపించని 90వ దశకంలో తెదేపా ప్రభుత్వం అంకితభావంతో నిర్మించిన ప్రత్యేక పార్క్ జినోమ్ వ్యాలీ. ఎంతో దూరదృష్టితో చేపట్టిన ఈ ప్రాజెక్టు నేడు కొవిడ్ కు వ్యాక్సిన్ తయారీ ప్రక్రియలో భారతదేశాన్ని ముందు వరుసలో ఉంచింది. దేశంలోని 150కిపైగా ఉన్న లైఫ్ సైన్స్ క్లస్టర్లలో ఇది మొదటిది. ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పనల సాక్ష్యాత్కారానికి ఓ చక్కటి ఉదాహరణగా నిలిచింది. లైఫ్ సైన్స్ స్పెక్ట్రంలో ఉత్తమ ప్రతిభను కనబరిచింది. జినోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కోవాగ్జిన్ టీకా ఈ వాస్తవాన్ని రుజువు చేసింది. భారత్ బయోటెక్ లోని ప్రతిభావంతులకు, కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్న సంస్థలన్నింటికీ నా అభినందనలు. వీళ్లు చేసే ప్రయత్నాలన్నీ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా." అని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details