ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CHANDRABABU: 'ప్రతేక విమానాల ద్వారా విద్యార్థులను తీసుకురావాలి' - chandrababu latest updates

CHANDRABABU: ఉక్రెయిన్ నుంచి విద్యార్థులను తరలించే విషయంలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర విదేశాంగ శాఖ సాయం కోరారు. జెఫ్రోజియా నుంచి ట్రైన్​లో బోర్డర్​కు బయలుదేరిన 1,481 మంది విద్యార్థుల వివరాలకు కేంద్ర మంత్రి జైశంకర్​కు పంపారు.

చంద్రబాబు
చంద్రబాబు

By

Published : Mar 1, 2022, 9:36 AM IST

CHANDRABABU: ఉక్రెయిన్​లో చిక్కుకున్న విద్యార్థుల వివరాలను... తెదేపా అధినేత చంద్రబాబు కేంద్ర విదేశాంగ శాఖకు పంపి సాయం కోరారు. జెఫ్రోజియా నుంచి ట్రైన్ లో బోర్డర్​కు బయలుదేరిన 1,481మంది విద్యార్థుల వివరాలు కేంద్ర మంత్రి జైశంకర్​కు పంపారు. ప్రస్తుతం బుచారెస్ట్, బుడాపెస్ట్ విమానాశ్రయాల నుంచి మాత్రమే విద్యార్థుల తరలింపు జరుగుతుందని లేఖలో పేర్కొన్నారు. స్లోవాకియ, మల్దోవ, పోలాండ్​ల నుంచి ప్రతేక విమానాలు నడిపి విద్యార్థులను తీసుకురావాలని చంద్రబాబు సూచించారు.

537 మంది తెలుగు విద్యార్థుల వివరాలు సేకరించాం: ఏపీ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులను భారత్‌కు రప్పించేందుకు ఏపీ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ నిరంతరాయంగా కృషి చేస్తోందని కమిటీ అధ్యక్షుడు కృష్ణబాబు తెలిపారు. విద్యార్థుల కోసం 24 గంటలు నిరంతరాయంగా పని చేసేలా 1902 హెల్ప్ లైన్ నంబరును అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఉక్రెయిన్‌లోని తెలుగు విద్యార్థుల సమాచారాన్ని కన్సల్టెన్సీల నుంచి తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటివరకు 537 మంది తెలుగు విద్యార్థుల వివరాలు సేకరించినట్లు వివరించారు. వారిలో అనంతపురం నుంచి 25 మంది, చిత్తూరు నుంచి 32, తూర్పుగోదావరి నుంచి 54, గుంటూరు నుంచి 45, కృష్ణా నుంచి 80, కర్నూలు నుంచి 18, ప్రకాశం నుంచి 32, నెల్లూరు నుంచి 22, శ్రీకాకుళం నుంచి 12, కడప నుంచి 18, విశాఖ నుంచి 77, పశ్చిమ గోదావరి నుంచి 38, విజయనగరం జిల్లా నుంచి 10 మంది విద్యార్థులు ఉక్రెయిన్‌లో ఉన్నట్లు తెలిసిందన్నారు. ఇప్పటివరకు ఉక్రెయిన్‌ నుంచి 32 మంది విద్యార్థులు ఏపీకి చేరుకున్నారని కృష్ణబాబు వెల్లడించారు.

ఉక్రెయిన్‌లోని 14 యూనివర్సిటీల్లో ఏపీకి చెందిన విద్యార్థులు ఉన్నారని కృష్ణబాబు తెలిపారు. విద్యార్థులను సురక్షితంగా రప్పించేందుకు పోలెండ్‌, రొమేనియా, హంగెరీ, స్లోవేకియాలోని తెలుగు సంఘాలను సంప్రదిస్తున్నట్లు చెప్పారు. ఆపరేషన్‌ గంగలో భాగంగా ఎల్లుండి వరకు విదేశాంగ శాఖ విమానాలు నడపనుందని కృష్ణబాబు వివరించారు.

ఇదీ చదవండి:

ఉక్రెయిన్​లో బాంబుల మోత.. విద్యార్థుల తల్లిదండ్రుల గుండెల్లో దడ

ABOUT THE AUTHOR

...view details