ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CBN: కుప్పం విద్యుత్ సహకార సంఘం విలీనంపై సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ - తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు

కుప్పం విద్యుత్ సహకార సంఘం విలీనంపై సీఎం జగన్‌కు.. తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. మారుమూల ప్రాంతాలకు విద్యుదీకరణ లక్ష్యంతో రెస్కోను స్థాపించినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. కుప్పం రెస్కో సంఘంలో లక్షా 22 వేల మందికి భాగస్వామ్యం ఉందన్న బాబు. రెస్కో వాటాదారుల్లో ఎక్కువమంది చిన్న, మధ్య తరగతి రైతులు ఉన్నట్లు లేఖలో పేర్కొన్నారు.

సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ
సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ

By

Published : Jul 30, 2021, 9:13 PM IST

కుప్పం రూరల్ ఎలక్ట్రిక్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (రెస్కో) విలీనం ప్రజాభిష్ఠానికి విరుద్దమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఏపీఎస్పీడీసీఎల్ లో విలీనం కాకుండా ఉండేందుకు విద్యుత్ చట్టం, 2003 సెక్షన్ 13 కింద లైసెన్స్ పొందకుండా మినహాయింపు ఇస్తూ ఆదేశాలు జారీ చేసేలా విద్యుత్ శాఖను ఆదేశించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేశారు. ఏపీఎస్పీడీసీఎల్ లో రెస్కో విలీనాన్ని తప్పుపడుతూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఈ మేరకు లేఖ రాశారు.

నూరు శాతం గ్రామీణ విద్యుదీకరణ సాధించే లక్ష్యంతో 1981లో రెస్కో కుప్పంను స్థాపించారని, ఇతర కొన్ని రెస్కోలు నష్టాలబాట పట్టినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో కుప్పం రెస్కో తన లక్ష్యాలను విజయవంతంగా సాధించిందని తెలిపారు. దాదాపు 1,22,000 భాగస్వాములు ఉన్న కుప్పం రెస్కో సొసైటీ 1,24,000 కనెక్షన్లతో గృహ, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలకు విద్యుత్ సేవలందిస్తోందన్నారు. వాటాదారులలో ఎక్కువమంది వ్యవసాయమే జీవనాధారంగా చేసుకుని బతికే చిన్న, మధ్య తరగతి రైతులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనారిటీ వర్గాలకు చెందినవారేనని స్పష్టంచేశారు.

కుప్పం రెస్కోను స్వయంప్రతిపత్తి సంస్థగా కొనసాగించాలని గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తే జిల్లా మంత్రి ఈ ఏడాది మార్చిలో ఏపీఎస్పీడీసీఎల్​లో విలీనం చేయమని ప్రకటించారని, కుప్పం ప్రజలు విలీనాన్ని వ్యతిరేకిస్తున్నా, ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ముందుకెళ్తోందని ఆగ్రహాం వ్యక్తంచేశారు. చిన్న చిన్న కారణాలతో విజయవంతంగా నడిచే రెస్కోను విలీనం చేయటం అర్థరహితమని దుయ్యబట్టారు. ఏపీఈఆర్సీ ఇచ్చిన ఆదేశాలు కుప్పం వాసుల్ని నిరాశపరిచడంతో పాటు రెస్కో ప్రారంభం నాటి నుంచి ప్రతిఏటా ప్రభుత్వం నుంచి లైసెన్స్ మినహాయింపు పొందడం నిరంతర ప్రక్రియగా సాగుతూ వస్తోందని లేఖలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

Venkaiah naidu: 'బయోటెక్నాలజీ హబ్​గా.. హైదరాబాద్​'

ABOUT THE AUTHOR

...view details