ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CBN Wishes to Pawan: పవన్ కల్యాణ్​కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, లోకేశ్​ - నందమూరి హరికృష్ణ జయంతి

CBN Wishes To Pawan Kalyan: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దివంగత నేత నందమూరి హరికృష్ణ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు.

చంద్రబాబునాయుడు
చంద్రబాబునాయుడు

By

Published : Sep 2, 2022, 11:29 AM IST

CBN Wishes To Pawan Kalyan: ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్​కు పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలను, ఆనంద ఐశ్వర్యాలను అనుగ్రహించాలని ఆకాంక్షించారు.

దివంగత నేత ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం కృషిచేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ జయంతి సందర్భంగా ఆయన స్మృతికి చంద్రబాబు నివాళులర్పించారు.

జనసేన అధ్యక్షుడు, సోదరుడు పవన్ కళ్యాణ్​కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ తెదేపా జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ట్వీట్‌చేశారు. నందమూరి హరికృష్ణ జయంతి సందర్భంగా ఆయన స్మృతికి ఘన నివాళులర్పించారు. నిస్వార్థంగా ఉండటం నందమూరి హరికృష్ణ సహజసిద్ధమైన లక్షణమని అన్నారు. చైతన్య రథసారధిగా ప్రారంభమైన రాజకీయ ప్రస్థానంలో చివరి వరకూ నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న నేత అని తెలిపారు. విలక్షణ నటనతో ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని లోకేశ్‌ గుర్తుచేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details