ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'వైకాపా నేతలు నేర స్వభావాన్ని మార్చుకోవాలి' - ముఖ్యమంత్రి జగన్

వైకాపా ప్రభుత్వ ఏడాది పాలనను ఉద్దేశిస్తూ....'విధ్వంసానికి ఒక్క ఛాన్స్' పేరిట తెదేపా అధినేత చంద్రబాబు వీడియో విడుదల చేశారు. ఇకనైనా వైకాపా నేతలు నేరపూరిత స్వభావాన్ని మార్చుకోవాలని హితవు పలికారు.

chandrababu
chandrababu

By

Published : May 31, 2020, 7:09 PM IST

వైకాపా ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నేర స్వభావం మార్చుకోకుండా వ్యవస్థలనే నాశనం చేసే స్థితికి వచ్చారని విమర్శించారు. కక్ష సాధింపులు, అక్రమార్జనకు వ్యవస్థలనే నాశనం చేస్తున్నారని అన్నారు. ఏడాది పాలనలో ఇంత గూండాయిజాన్ని చూడలేదని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను నామినేషన్ వేయకుండా చేశారని గుర్తు చేశారు. ఇకనైనా వైకాపా నేతలు నేరపూరిత స్వభావాన్ని మార్చుకోవాలని చంద్రబాబు హితవు పలికారు.

చంద్రబాబు ట్వీట్

ABOUT THE AUTHOR

...view details