NEW YEAR WISHES: రాష్ట్ర ప్రజలకు, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కష్టాలన్నీ తొలగిపోయి 2022లో ప్రజలకు అంతా మేలు జరగాలని, అన్ని రంగాలలో అభివృద్ది జరిగి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చంద్రబాబు ఆకాక్షించారు.
NEW YEAR WISHES: తెలుగు ప్రజలకు చంద్రబాబు, నారా లోకేశ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు - తెలుగు ప్రజలకు చంద్రబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు
NEW YEAR WISHES:రాష్ట్ర ప్రజలకు, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
![NEW YEAR WISHES: తెలుగు ప్రజలకు చంద్రబాబు, నారా లోకేశ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు , నారాలోకేశ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14064739-360-14064739-1641007744005.jpg)
గడచిన కాలంలో ఆలోచనలు, నమ్మకాలలో కొన్ని మనల్ని తప్పుదారి పట్టించి ఉండవచ్చని, మన బలహీనతల వల్ల మోసపోయి ఉండవచ్చునన్న నారా లోకేశ్.. బాధపడుతూ కూర్చుంటే ప్రయోజనం లేదని స్పష్టం చేశారు. గతం నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతూ ఉండాలన్నారు. చేసిన తప్పుకు మళ్లీ ఇంకో ఛాన్స్ ఇవ్వకుండా మార్పును ఆహ్వానించాలని లోకేశ్ కోరారు. కాలంతో పాటు కళ్లు మూసుకుని వెళ్లకండి అని, రేపటి రోజు నాదే అన్న ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే, ముందున్న కాలం మనం చెప్పినట్టుగా నడుస్తుందని సూచించారు. కొత్త సంవత్సరం కొత్త ప్రగతి ప్రజల జీవితానికి శుభాలను పంచాలని ఆకాక్షించారు.
ఇదీ చదవండి: