ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'వైకాపా అవినీతిని ప్రశ్నించినందుకే కొల్లు రవీంద్రను కేసులో ఇరికించారు'

వైకాపా అవినీతిని ప్రశ్నించినందుకే మాజీ మంత్రి కొల్లు రవీంద్రను కేసులో ఇరికించారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. పార్టీ నాయకులతో టెలీ కాన్ఫెరెన్స్‌ నిర్వహించిన ఆయన... హత్య కేసులో కొల్లు రవీంద్రను ఇరికించేందుకే ఫోన్ కాల్స్ డ్రామా ఆడుతున్నారన్నారు. ఇళ్ల నిర్మాణంలో వైకాపా వేధింపులపై రేపు నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు.

chandrababu naidu fires on ycp about kollu ravindra case
వైకాపాపై మండిపడ్డ చంద్రబాబు

By

Published : Jul 5, 2020, 2:06 PM IST

వైకాపా అవినీతిని ప్రశ్నించినందుకే మాజీ మంత్రి కొల్లు రవీంద్రను కేసులో ఇరికించారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. పార్టీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఆయన... రవీంద్ర చీమకు కూడా అపకారం చేయని మనిషని అన్నారు. హత్య కేసులో కొల్లు రవీంద్రను ఇరికించేందుకే ఫోన్ కాల్స్ డ్రామా ఆడుతున్నారని అన్నారు. ఆధిపత్య పోరులో పరస్పరం హత్యలు చేసుకున్నారని... రెండు కుటుంబాల మధ్య కక్షలను రెచ్చగొట్టింది వైకాపాయేనని మండిపడ్డారు. 13 నెలలైనా వైఎస్‌ వివేకా హంతకులను పట్టుకోలేకపోయారని ఎద్దేవా చేశారు.

తెదేపా నిర్మించిన ఇళ్లను ఇంతవరకు పేదలకు అందించలేదని... పార్టీపై కక్షతోనే లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వకుండా వేధిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఇళ్ల నిర్మాణంలో వైకాపా వేధింపులపై సోమవారం నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. ఇళ్ల స్థలాల్లో వైకాపా అవినీతి, కుంభకోణాలపై ఈ నెల 7న నిరసనలు జరపనున్నట్లు ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details