రాష్ట్ర ప్రభుత్వం తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం లేదని తెదేపా అధినేత చంద్రబాబు ఆక్షేపించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఓ గర్భిణీ కొవిడ్ పరీక్ష కోసం 5 గంటలు వేచి ఉండడం హృదయ విదారకమని ఆవేదన వ్యక్తం చేశారు. అంత సమయం ఆస్పత్రిలో జనం మధ్య ఉంటే ఆమెకు.. మొత్తం ఆమె కుటుంబానికే వైరస్ సోకే ప్రమాదం ఉందని ఆందోళన చెందారు. పిల్లలతో పాటు గర్భిణీ.. ప్రభుత్వ ఆస్పత్రి బయట వేచి ఉన్న ఫోటోను తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
కొవిడ్ పరీక్షలకు గర్భిణి 5 గంటలు వేచి ఉండడం విచారకరం: చంద్రబాబు - pregnant lady covid test in rajamahendravaram news
రాష్ట్రంలో కరోనా పరీక్షల తీరుపై తెదేపా అధినేత చంద్రబాబు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఓ గర్భిణీ కొవిడ్ పరీక్షల కోసం ఆస్పత్రి బయట గంటల సేపు వేచి ఉండడం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన చెందారు. ప్రభుత్వం గుణపాఠాలు నేర్చుకోవడం లేదని విమర్శించారు.
కొవిడ్ పరీక్షలకు గర్భిణి 5 గంటలు వేచి ఉండడం విచారకరం: చంద్రబాబు