కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ను పరిశీలించాలని ఆదేశిస్తూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు 10మంది సభ్యులతో నిజనిర్ధారణ కమిటీని నియమించారు. కమిటీ సభ్యులు రేపు (శనివారం) అక్రమమైనింగ్ జరిగే ప్రాంతంలో పర్యటించి తనకు నివేదిక ఇవ్వాలని అదేశించారు. కమిటీ సభ్యులుగా వర్ల రామయ్య, నక్కా ఆనందబాబు, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, బొండా ఉమామహేశ్వరరావు, కొనకళ్ల నారాయణ, నెట్టెం రఘురాం, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తంగిరాల సౌమ్య, నాగులమీరాలను నియమించారు.
TDP: కొండపల్లిలో మైనింగ్ పరిశీలనకు పది మందితో కమిటీ - Kondapalli mining
కొండపల్లిలో మైనింగ్ పరిశీలనకు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు.. పది మంది సీనియర్ నేతలతో నిజనిర్దరణ కమిటీ వేశారు. ఈ కమిటీ శనివారం కొండపల్లిలో మైనింగ్ ప్రాంతంలో పర్యటించనుంది.
కొండపల్లిలో మైనింగ్ పరిశీలనకు పది మందితో కమిటీ