ఇసుక కొరతపై తాజా పరిణామాలు,భవిష్యత్ కార్యాచరణపై తెదేపాలో మేధోమథనం సాగుతోంది.పార్టీ ముఖ్య నేతలు,ఎమ్మెల్యేలతో చంద్రబాబు అమరావతిలో సమావేశమయ్యారు.భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై పోరాటం దిశగా నేతలకు చంద్రబాబు పలు సూచనలు చేశారు.పలువురు నేతలు జిల్లాల్లో పరిస్థితులను అధినేతకు వివరించినట్లు సమాచారం .
పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశం
తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించనున్నారు. అనంతరం పార్టీ ఎంపీలతో పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహిస్తారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కులపై పోరాటం సహా పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
cbn
.
Last Updated : Nov 15, 2019, 3:50 PM IST