గవర్నర్‌తో చంద్రబాబు భేటీ... ప్రభుత్వంపై ఫిర్యాదు.... - complaint to ycp
అమరావతి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను తెదేపా అధినేత చంద్రబాబు, ఇతర నేతలు కలిశారు. కోడెల ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై విచారణ చేపట్టాలని ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని గవర్నర్‌కు చంద్రబాబు వివరించారు.
![గవర్నర్‌తో చంద్రబాబు భేటీ... ప్రభుత్వంపై ఫిర్యాదు....](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4487138-thumbnail-3x2-babu.jpg)
ప్రజాస్వామ్యాన్ని భయపెట్టే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు....గవర్నర్‌కు ఫిర్యాదుచేశారు.ఈమేరకు13పేజీల నివేదికను గవర్నర్ విశ్వభూషణ్‌కి చంద్రబాబు,పార్టీ నాయకులు కలిసి అందచేశారు.రాష్ట్రంలో శాంతి భద్రతలు,కోడెల మృతి,తెలుగుదేశం నేతలపై కేసుల విషయంపై....రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్‌ని కలిసి చంద్రబాబు ఫిర్యాదు చేశారు.ప్రతిపక్ష నేతలు,పార్టీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం అక్రమకేసులు పెడుతుందని ఆరోపించారు.డీజీపీ నుంచి కిందిస్థాయి వరకు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారన్నారు.కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు ఇలాంటి పరిణామాలే ఉసిగొల్పాయని ఫిర్యాదులో చంద్రబాబు పేర్కొన్నారు.ఎన్నికల ఫలితాల తర్వాత కోడెలపై18కేసులు అక్రమంగా పెట్టారని ఆరోపించారు.సోమిరెడ్డి,అచ్చెన్నాయుడు,చింతమనేని,నన్నపనేనితో పాటు...ఇతర నాయకులను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని లేఖలో ఫిర్యాదు చేశారు.ఈ విషయాలపై డీజీపీకి రెండు పుస్తకాలు అందచేసినా ఫలితంలేదని చంద్రబాబు పేర్కొన్నారు.గవర్నర్‌గా మీరైనా చొరవతీసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని...బిశ్వభూషణ్‌కు చంద్రబాబు విజ్ఞప్తిచేశారు.