జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులందరికీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. మగ్గం ఉన్న నేత కుటుంబాలకు వైకాపా ప్రభుత్వం ఏడాదికి 24వేల ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ హామీ అమలు కావాలని ఆకాంక్షించారు. చేనేత కళాకారుల కష్టం కొలవలేనిదనీ, వారి కళ వెలకట్టలేనిదని నారా లోకేష్ కొనియాడారు. మంగళగిరి చేనేత పరిశ్రమ అభివృద్ధికి తన వంతు కృషిచేస్తానన్నారు.
'చేనేత కళాకారుల కష్టం కొలవలేనిది.. వెలకట్టలేనిది' - చేనేత
చేనేత కళాకారుల కష్టం కొలవలేనిదనీ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కొనియాడారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు.
'చేనేత కళాకారుల కష్టం కొలవలేనిది.. కళ వెలకట్టలేనిది'