ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఆంధ్రకేసరి.. అణిచివేతపై రాజీలేని పోరాటాన్ని జాతికి నేర్పారు' - టంగుటూరికి చంద్రబాబు నివాళుల వార్తలు

స్వాతంత్య్ర సమరయోధునిగా, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఆంధ్రకేసరి ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు.

chandrababu lokesh tribute to tanguturi praksam
చంద్రబాబు

By

Published : Aug 23, 2020, 4:14 PM IST

తుపాకులకు గుండెలు ఎదురొడ్డి హక్కులు కాపాడుకోవడం, అణిచివేతపై రాజీలేని పోరాటం 'ఆంధ్రకేసరి' మనకందించిన స్ఫూర్తి అని తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​లు స్పష్టం చేశారు. తెలుగుదేశం హయాంలో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని రాష్ట్ర పండుగగా చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. ఆయన బాటలో నడిచి మన హక్కులు కాపాడుకోవడమే ఆంధ్రకేసరికి మనం అందించే నివాళి అని అన్నారు.

చంద్రబాబు ట్వీట్

ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. స్వాతంత్య్ర సమర యోధునిగా, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఆంధ్రకేసరి ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. పాఠశాలకు ఫీజు కట్టలేనంత నిరుపేద స్థితి నుంచి, న్యాయవాదిగా ఆ రోజుల్లో వేల రూపాయల ఫీజు తీసుకునే స్థాయికి ఎదిగిన వ్యక్తి ప్రకాశం పంతులు అని లోకేశ్ కొనియాడారు. దేశం కోసం ఆ వృత్తిని తృణప్రాయంగా వదిలేసి జాతీయోద్యమంలో పాల్గొని సాహసానికి, త్యాగానికి నిదర్శనంగా నిలిచారన్నారు.

ABOUT THE AUTHOR

...view details