దేశంలో కరోనా తీవ్రత దృష్ట్యా లాక్‌డౌన్ ఈ నెలాఖరుదాకా పొడిగించాలని చంద్రబాబు అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. విశాఖ మెడ్‌టెక్ జోన్ పై పూర్తి శ్రద్ధ పెట్టి అభివృద్ది చేయాలని సూచించారు. 'సేవలందిస్తూ మరణించిన ఫ్రంట్‌లైన్ వారియర్లకు కేంద్రం రూ.50లక్షల బీమా... కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రూ.25లక్షలు ఆర్థిక సాయం చేయాలి. పంటలు, పండ్లు, ఆక్వా ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ప్రతి పేదకుటుంబానికి రూ.5 వేలు ఆర్థిక సాయం అందించాలి. రైతులు, పేదలు, చేతివృత్తులు, చిరు వ్యాపారుల విద్యుత్, నీటి బిల్లులు రద్దు చేయాలి. ఇతర దేశాలు, బయట రాష్ట్రాల్లో చిక్కుకున్న తెలుగువారిని ఆదుకోవాలని' చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు.
ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్ పొడిగించాలి: చంద్రబాబు - జగన్‌కు చంద్రబాబు లేఖ న్యూస్
తెదేపా పొలిట్ బ్యూరో తీర్మానాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో కరోనా మూడో దశకు చేరడం ప్రమాద ఘంటికలు మోగిస్తోందని అభిప్రాయపడ్డారు.
ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్ పొడిగించాలి: చంద్రబాబు