రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్‌కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. చిత్తూరు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న ఓం ప్రతాప్ఫోన్ కాల్ డేటా బయటకు తీయాలని కోరారు. మృతుడు ఓం ప్రతాప్న బెదిరించిన వారిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాత్ర బయటపడుతుందని వివరించారు. దళిత యువకుడైన ఓం ప్రతాప్ ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ఓం ప్రతాప్ పెట్టిన ఒక పోస్ట్ పై వైకాపా నేతలు బెదిరింపులకు దిగారని, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాత్ర ఇందులో ఉందని ఆరోపించారు. ఈ కారణంగానే అతను ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. వైకాపా ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు విచారకరమన్నారు.
ఓం ప్రతాప్ కాల్ డేటా తీయండి... డీజీపీకి చంద్రబాబు లేఖ - చంద్రబాబు
రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్‌కు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. చిత్తూరు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న దళితుడు ఓం ప్రతాప్ ఫోన్ కాల్ డేటా బయటకు తీయాలని కోరారు. ఈ కేసులో మంత్రి పెద్దిరెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు.
chandrababu