ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ తాజా చర్య వల్ల బీసీలకు రిజర్వేషన్ ఫలాలు దూరమవుతున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు అమలవుతున్న 34 శాతం రిజర్వేషన్లను పరిరక్షించాలని కోరారు. సుప్రీంకోర్టులో వెంటనే స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని విజ్ఞప్తి చేశారు. బీసీలకు 24 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలనుకోవడం గర్హనీయమన్న చంద్రబాబు... ఇంత తీవ్రమైన సమస్యపై అఖిలపక్షాన్ని ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. బీసీ సంఘాలను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయం సరికాదని హితవు పలికారు. బీసీల రాజకీయ, సామాజిక, ఆర్థిక ప్రగతికి తెదేపా కృషి చేస్తోందని లేఖలో పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి జగన్‌కు చంద్రబాబు బహిరంగ లేఖ - chandrababu latest news
సీఎం జగన్‌కు తెదేపా అధినేత చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. బీసీలకు అమలవుతున్న 34 శాతం రిజర్వేషన్లను పరిరక్షించాలని కోరారు. సుప్రీంకోర్టులో వెంటనే స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని విజ్ఞప్తి చేశారు.
సీఎం జగన్‌కు చంద్రబాబు బహిరంగ లేఖ