ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'వైకాపా ప్రభుత్వ దుశ్చర్యల వల్లే కరోనా వ్యాప్తి'

By

Published : Apr 17, 2020, 8:52 PM IST

సీఎం జగన్​కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. నమూనాల సేకరణ, పరీక్షలు, ఫలితాల వెల్లడిలో జాప్యం ప్రాణాంతకమన్న చంద్రబాబు... పొంతనలేని లెక్కలతో ప్రజల్లో గందరగోళం సృష్టించడం సరికాదని హితవు పలికారు.

Chandrababu Letter to cm Jagan Over Corona
చంద్రబాబు లేఖ

ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. కరోనా, లాక్‌డౌన్‌ వల్ల తలెత్తిన 6 అంశాలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పేదలు, రైతులు, వ్యాపారులు పూర్తిగా కుదేలయ్యారని చంద్రబాబు లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. కష్టకాలంలో విరాళాల పేరుతో వారిని వైకాపా నేతలు వేధించారని ఆరోపించారు. సహాయ చర్యలనూ రాజకీయం చేయడం హేయమని చంద్రబాబు విమర్శించారు.

25 లక్షల మందికి నగదు, సరకులు ఇవ్వకపోవడం శోచనీయమని లేఖలో చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికీ లబ్ధి చేయడమే పాలనా ధర్మమని హితవు పలికారు. వైకాపా ప్రభుత్వ దుశ్చర్యల వల్లే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందిందని పేర్కొన్నారు. నమూనాల సేకరణ, పరీక్షలు, ఫలితాల వెల్లడిలో జాప్యం ప్రాణాంతకమన్న చంద్రబాబు... పొంతనలేని లెక్కలతో ప్రజల్లో గందరగోళం సృష్టించడం సరికాదని హితవు పలికారు. టెస్టులు పెరగకుండా కేసులు పెరిగినట్లు చూపిస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబు లేఖ
చంద్రబాబు లేఖ
చంద్రబాబు లేఖ

ఇదీ చదవండీ... 'కరోనా కేసులపై ప్రభుత్వ హెల్త్ బులెటిన్లు బోగస్'

ABOUT THE AUTHOR

...view details