ముఖ్యమంత్రి జగన్‌కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి స్థాయిలో పింఛన్ చెల్లించాలని కోరారు. మార్చి నెలకు సంబంధించి సగం జీతాలే చెల్లించడం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. సుదీర్ఘ కాలం ప్రభుత్వ సేవలందించిన వారి పట్ల ఈ తరహా చర్య సబబు కాదని క్షేపించారు. పింఛన్ అందుకునే వారంతా 60 ఏళ్లు పైబడినవారే అన్ని తెలిపారు. ఈ వయసు వారికి కరోనా వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని.. వయోభారంతో వచ్చే అనారోగ్య సమస్యలకు వైద్య ఖర్చులు ఎక్కువ అవుతాయని లేఖలో ప్రస్తావించారు.
'విశ్రాంత ఉద్యోగులకు పూర్తి స్థాయి పింఛన్ చెల్లించండి' - latest news of pensions of retired employee
విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి స్థాయిలో పింఛన్ చెల్లించాలని ప్రభుత్వాన్ని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కోరారు.
cbn letter cm