ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చిత్తూరు జిల్లా ఎస్పీకి చంద్రబాబు లేఖ - chittor latest news

తెదేపా నేతల గృహనిర్బంధాలను నిరసిస్తూ....తెదేపా అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. అక్రమ నిర్బంధాలకు గురైన వ్యక్తులను బేషరతుగా విడుదల చేయాలని లేఖలో ఎస్పీని కోరారు.

Chandrababu
చంద్రబాబు

By

Published : Oct 27, 2020, 8:47 AM IST

చిత్తూరు జిల్లాలో సోమవారం తెలుగుదేశం నేతల గృహనిర్బంధాలను నిరసిస్తూ.....ఆ పార్టీ అధినేత చంద్రబాబు జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. కుప్పం ప్రజల సాగునీటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు.....జిల్లా పార్టీ నేతలు ఆందోళన చేశారన్నారు. ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడం ప్రభుత్వం బాధ్యత అన్న ఆయన....ప్రభుత్వానికి వేరే ఇతర ప్రాధాన్యాంశాలు ఉన్నట్లుగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. అక్రమ నిర్బంధాలకు గురైన వ్యక్తులను బేషరతుగా విడుదల చేయాలని లేఖలో ఎస్పీని కోరారు. ప్రజాస్వామ్య విస్తృత ప్రయోజనాలను కాపాడాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details