సంక్రాంతి తరువాత ఉద్యమం ఉద్ధృతం: చంద్రబాబు
అమరావతి రైతులు రోడ్డున పడి ఆందోళనలు చేస్తుంటే...రాష్ట్ర ముఖ్యమంత్రి కోడిపందేలు...ఎడ్ల పందేలతో సంబరాలు చేసుకుంటున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. తుళ్లూరులో రైతుల దీక్షలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న ఆయన..రైతుల త్యాగాన్ని గుర్తించలేని స్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారని మండిపడ్డారు.
అమరావతి రైతులు రోడ్డున పడి ఆందోళనలు చేస్తుంటే...రాష్ట్ర ముఖ్యమంత్రి కోడి పందేలు...ఎడ్ల పందేలతో సంబరాలు చేసుకుంటున్నారనితెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు.తుళ్లూరులో రైతుల దీక్షలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న చంద్రబాబు..రైతుల త్యాగాన్ని గుర్తించలేని స్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారని మండిపడ్డారు.ప్రభుత్వ తీరు వల్ల ఈ ఏడాది ప్రజలకు కష్టాల సంక్రాంతే అయ్యిందని అన్నారు.పండుగ తర్వాత ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.రాజధాని అంశం5కోట్ల ఆంధ్రుల సమస్య అని ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు చేస్తామంటే కుదరదని స్పష్టం చేశారు.గట్టిగా పోరాడి అమరావతి సాధించుకుందామని..అధైర్యపడి ప్రాణత్యాగాలు చేసుకోవద్దని రైతులకు సూచించారు.