ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చంద్రబాబు నివాస గేటు తాళ్లను తొలగించిన పోలీసులు - మానవ హక్కుల ఉల్లంఘన

చలో ఆత్మకూరు నేపథ్యంలో తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇంటి గేటుకు కట్టిన తాళ్లను.. పోలీసులు తొలగించారు. ఆయన్ను గృహ నిర్బంధం చేయడంలో భాగంగా.. ఉదయం కట్టిన తాళ్లను తీసేశారు. అనంతరం సెక్షన్ 151 కింద నోటీసులు జారీ చేశారు.

చంద్రబాబు నివాస గేటు తాళ్లను తొలిగించిన పోలీసులు

By

Published : Sep 11, 2019, 11:05 PM IST

చంద్రబాబు నివాస గేటు తాళ్లను తొలిగించిన పోలీసులు

చంద్రబాబు నివాసంలో గేటుకు కట్టిన తాళ్లను పోలీసులు తొలిగించారు. బుధవారం ఉదయం చలో ఆత్మకూరుకు బయలుదేరిన చంద్రబాబును అడ్డుకునేందుకు పోలీసులు ఆయన ఇంటి గేటును తాళ్లతో కట్టారు. సాయంత్రానికి తాళ్లను తొలిగించిన అనంతరం సెక్షన్ 151 కింద పోలీసులు నోటీసులు జారీచేశారు. 12 గంటల గృహ నిర్బంధం తర్వాత నోటీసులు జారీచేయడంపై తెదేపా తరఫు న్యాయవాదులు పోలీసులను ప్రశ్నించారు. నోటీసులలో కనీస సమాచారం లేదని.. అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయవాదుల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా పోలీసులు వెళ్లిపోయారు. నోటీసులు ఇవ్వకుండా నిర్బంధించడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని తెదేపా ఆరోపించింది. చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులే చట్టాన్ని ఉల్లంఘించారని తెదేపా పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details