ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని హోలీ పండుగ జరుపుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. హోలీ పండుగ వచ్చిందంటే ఆ ఉత్సాహం ఎంత రంగులమయంగా ఉంటుందో అందరికీ తెలుసునన్న ఆయన.. ఈసారి ఆ ఉత్సాహాన్ని కరోనా వైరస్ నీరుగార్చిందన్నారు. పండుగ ప్రతి ఏటా వస్తుంది కాబట్టీ మరేం పరవాలేదంటూ ప్రజలందరికీ ట్విటర్‌లో హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు: చంద్రబాబు - చంద్రబాబు హోలీ శుభాకాంక్షల వార్తలు
రాష్ట్ర ప్రజలకు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని హోలీ పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

chandrababu holi greetings to all people
రసాయన రంగులకు బదులు సహజసిద్ద రంగులతో సురక్షితంగా హోలీ జరపుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సూచించారు. వసంతోత్సవంగా చెప్పుకునే ఈ పండుగ ప్రతి ఇంటికీ నిత్య వసంతాలను తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నా అని ట్విటర్ వేదికగా హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చదవండి : లోకల్ ఫైట్: ఎవరు అర్హులు..ఎవరు అనర్హులో తెలుసా?