ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP PARLIAMENTARY PARTY MEETING: 'రాష్ట్రంలోని వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి'

By

Published : Nov 27, 2021, 6:01 PM IST

Updated : Nov 28, 2021, 6:14 AM IST

దేశంలోనే అత్యధికంగా(TDP Parliamentary Party Meeting) రాష్ట్రంలోని 93 శాతం కుటుంబాలు అప్పుల్లో ఉన్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కౌలు రైతులతో పాటు అన్నదాతల ఆత్మహత్యల్లో రాష్ట్రం ముందు ఉండటానికి వైకాపా విధానాలే కారణమన్నారు. ఈ విషయాన్ని లోక్‌సభలో ఎండగట్టాలని పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. వరదలను ఎదుర్కోవడంలో జగన్‌ ప్రభుత్వం విఫలమైందన్న చంద్రబాబు... కేంద్రమే జాతీయ విపత్తుగా ప్రకటించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాల్సిన అవసరముందన్నారు.

తెదేపా పార్లమెంటరీ పార్టీ
tdp Parliamentary Party Meeting

తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం

TDP Parliamentary Party Meeting:కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానం, రైతుల ఆత్మహత్యల్లో మూడో స్థానంలో రాష్ట్రం నిలవడం జగన్‌ రైతు వ్యతిరేక చర్యలకు అద్దం పడుతోందని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ అభిప్రాయపడింది. వీటిపై పోరాడాలని పార్టీ ఎంపీలకు చంద్రబాబు సూచించారు. జూమ్ ద్వారా పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించిన ఆయన …సమావేశాల్లో చర్చించాల్సిన వివిధ అంశాలపై తీర్మానించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌ అధిక ధరలు(petrol taxes in andhra pradesh), రాష్ట్ర ప్రభుత్వ పన్నులు, ప్రత్యేక హోదా, 3 రాజధానులు వంటి అంశాలపై పోరాడాలని తీర్మానించారు.

ఎంపీలకు దిశానిర్దేశం..

రాజధానిగా అమరావతినే ఉంచాలనే డిమాండ్‌ను పార్లమెంట్​లో(లో(tdp on Winter Session of Parliament 2021) గట్టిగా వినిపించాలని చంద్రబాబు సూచించారు. పంటలకు మద్దతు ధర లేక, ప్రభుత్వ సహకారం అందక... రైతులు పడుతున్న బాధలను కేంద్ర పెద్దలకు వివరించాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో వరి పంట వేయొద్దని మంత్రులు ప్రకటించడాన్ని.. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఏపీ నుంచి గంజాయి వంటి మాదకద్రవ్యాల సరఫరా జరుగుతున్న అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు.

వైకాపా అరాచకాలను కేంద్ర దృష్టికి తీసుకెళ్లాలి..

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళం విప్పాలన్నారు. వ్యాక్సినేషన్‌లో ఏపీ వెనుకంజలో ఉండటాన్ని తెదేపా పార్లమెంటరీ పార్టీ తప్పుబట్టింది. వైఎస్‌ వివేకా హత్యకు సుపారీ ఇచ్చినట్లుగా చెబుతున్న విషయంలో ఈడీ విచారణకు పట్టుబట్టాలని నిర్ణయించారు. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులతో పాటు కేంద్రం వివిధ పథకాలకు ఇచ్చే డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లిస్తుందని.. ఈ విషయాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎంపీలు నిర్ణయించారు. బలహీనవర్గాలకు అన్యాయం చేస్తూ బీసీ జనగణనపై అసెంబ్లీ తీర్మానం కంటితుడుపు చర్యగా చేశారని తెదేపా పార్లమెంటరీ పార్టీ దుయ్యబట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా దాడులు, అక్రమాలకు పాల్పడిందన్న తెలుగుదేశం ఎంపీలు... ఈ అరాచకాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

పార్లమెంటరీ పార్టీ సమావేశం తీర్మానాలు:

  1. దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై జగన్‌ ప్రభుత్వం పన్నులు, నిత్యావసర ధరల పెరుగుదల, ప్రత్యేకహోదా, 3 రాజధానుల బిల్లు వంటి అంశాలపై లేవనెత్తాలని నిర్ణయం.
  2. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇతర రాష్ట్రాలకు గంజాయి, హెరాయిన్‌ సరఫరా అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తనున్నారు.
  3. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన
  4. వ్యాక్సినేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడడం దేశానికి అన్నపూర్ణగా పిలవబడిన ఆంధ్రప్రదేశ్‌లో వరి పంట వేయరాదని మంత్రులు ప్రకటించిన అంశాన్ని కూడా పార్లమెంటులో ప్రస్తావించాలన్నారు.
  5. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి 40 కోట్ల సుఫారీ, అడ్వాన్సుగా కోటి రూపాయల చెల్లింపులపై ఈడీ విచారణ
  6. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులు మళ్లింపు, ఉపాధి హామీ నిధులు మళ్లింపు, ఈఏపీ నిధులు దారిమళ్లింపు
  7. బీసీలకు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని నిర్ణయం.

ఇదీ చదవండి:

MISUSING MPLADS FUNDS IN AP: ఎంపీ లాడ్స్ నిధులపై నివేదిక పంపండి.. ఏపీకి కేంద్రం ఆదేశం

Last Updated : Nov 28, 2021, 6:14 AM IST

ABOUT THE AUTHOR

...view details