మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయడాన్ని తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. సాయంత్రం 5 తర్వాత 4.20 గం. సమయం వేసి డిశ్చార్జ్ చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిశ్చార్జ్ చేయడంలో కనీస నిబంధనలు పాటించకపోవడం గర్హనీయమని అన్నారు. కమిటీ పేరుతో ఒత్తిడి తెచ్చి తప్పుడు నివేదిక ఇప్పించడం శోచనీయమన్న చంద్రబాబు... అచ్చెన్నాయుడి ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని ఆక్షేపించారు. అచ్చెన్నాయుడి అరెస్టులో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక తప్పులు చేసిందని తెలిపారు. ఎన్ని ఎదురుదెబ్బలు తగులుతున్నా మార్పు రాలేదని మండిపడ్డారు.
అధికార దుర్వినియోగం: లోకేశ్