వైకాపా పరిపాలన, ఆ పార్టీ శ్రేణుల తీరుపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. రాజధాని అమరావతి గురించి ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని నిలదీశారు. తన కాన్వాయ్‌పై వైకాపా కార్యకర్తలు రాళ్లు రువ్వడాన్ని ఖండించారు. వైకాపా నేతలు రాజధాని అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఐదు కోట్ల ఆంధ్రుల రాజధానిని పట్టించుకోకపోవడం దారుణమన్న చంద్రబాబు... ప్రశ్నించినవారిపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. రాజధానిపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని గుర్తు చేశారు. అమరావతిని పట్టించుకోకపోవడం ఆంధ్రా బిడ్డల భవిష్యత్తును నాశనం చేయడమే అన్నారు. ఎంతో త్యాగం చేసి రైతులు భూములు ఇస్తే... వారిని అవమానపరుస్తారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు రావాలంటేనే భయపడే పరిస్థితి మంచిది కాదని హితవు పలికారు.
'రాజధానిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా..?'
అమరావతి పర్యటనలో.. తన కాన్వాయ్‌పై జరిగిన రాళ్ల దాడిని తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. రాజధానిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా.. అని అధికార పార్టీ నేతలను ప్రశ్నించారు.
chandrababu fires