ఉద్యమంలో చురుగ్గా ఉన్నవారిని ఇబ్బందిపెట్టడానికే... అరెస్ట్ కుట్రలు చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. సీఎం జగన్ ఆదేశాల మేరకే ఇవన్నీ జరుగుతున్నాయని ఆరోపించారు. న్యాయం చేయాలని పోరాటం చేస్తుంటే ఇబ్బందిపెడతారా అని ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్లు మారుస్తూ ఉంటారా అని డీజీపీని నిలదీశారు. పోలీసులు చట్ట ఉల్లంఘనకు పాల్పడడం మంచిది కాదన్నారు. ఆరుగురు రైతులకు ఐదు కోట్లమంది ప్రజలు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఒక రాజధానికి డబ్బుల్లేవనేవాళ్లు.. 3 రాజధానులు ఎలా కడతారంటూ ప్రశ్నించారు. రాజధాని మార్చట్లేదని ఇప్పటికైనా స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
'సీఎం ఆదేశాల మేరకే అన్నీ జరుగుతున్నాయి' - వైకాపా ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు
రైతులపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయడం దారుణమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పోరాటానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా కారాగారంలో ఉన్న రాజధాని ప్రాంత రైతులను చంద్రబాబు పరామర్శించారు.
చంద్రబాబు నాయుడు