ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నిరంతర విద్యుత్​నూ రివర్స్ చేసేశారు: చంద్రబాబు - no current

రాష్ట్రంలో విద్యుత్‌ కోతలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీఏలను రద్దు చేసిన దుష్ఫలితమే ఏపీలో అంధకారానికి కారణమన్నారు. రైతులకు 9 గంటలు నిరంతర విద్యుత్​ ఇస్తామన్న వైకాపా ఇప్పుడు సగానికి కోసేసిందని ధ్వజమెత్తారు.

చంద్రబాబు

By

Published : Sep 30, 2019, 8:47 PM IST

'రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు జగమొండితనం శాపం అయ్యిందని' తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధిని రివర్స్‌ చేస్తున్న ప్రభుత్వం నడుస్తోందని... దాని ఫలితమే ఈ అప్రకటిత కరెంట్‌ కోతలని ట్విట్టర్‌లో విమర్శించారు. కేంద్రం తోడ్పాటుతో తెదేపా ప్రభుత్వం తెచ్చిన నిరంతర విద్యుత్​ను కూడా రివర్స్ చేసేశారని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చాక 9 గంటల విద్యుత్‌ ఇస్తామన్న వైకాపా ప్రస్తుతం అందులో సగానికి కోసేసిందని ధ్వజమెత్తారు. పీపీఏలను మూర్ఖంగా రద్దుచేసిన దుష్ఫలితమే రాష్ట్రంలో ఈ అంధకారమన్నారు. థర్మల్ విద్యుత్ ఆధారపడదగింది కాదని పైగా పర్యావరణ హితం కూడా కాదని చంద్రబాబు తెలిపారు. ఈ పరిణామాలు ముందే ఊహించి తాము సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిని పెద్ద ఎత్తున ప్రోత్సహించామని గుర్తు చేశారు. "తనకు తెలియదు, ఇతరులు చెబితే వినరు" అంటూ జగన్​ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.

చంద్రబాబు ట్వీట్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details