అసెంబ్లీలో తెదేపా సభ్యుల సస్పెన్షన్ అనంతరం సచివాలయం అగ్నిమాపక కేంద్రం వరకు తెదేపా అధినేత చంద్రబాబు ఎమ్మెల్యేలతో కలిసి నిరసన ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ...అన్ని కేటాగిరిల్లోని టిడ్కో ఇళ్లను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బకాయిలు కట్టి, ఎప్పుడు ఇళ్లు పూర్తి చేస్తారో ప్రజలకు స్పష్టంచేయాలన్నారు. ప్రతిపక్షనేతగా ఎన్నికల ప్రచారంలో అన్ని కేటాగిరిల ఇళ్లు ఉచితంగా ఇస్తామన్న జగన్ ఆ మాటలకు కట్టుబడి ఉండాలన్నారు. సమాధానం చెప్పే సత్తా లేక అసహనంతో సొంత డబ్బులు ఇస్తున్నట్లు గాలి మాటలు చెబుతున్నారని దుయ్యబట్టారు. వాస్తవాలు చెప్పే పరిస్థితిలో లేని సీఎం ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. ఏడాదిన్నరగా వైకాపా ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్న చంద్రబాబు...లాటరీ పద్ధతిలో తాము కేటాయించిన ఇళ్లను రద్దుచేసి సొంత వారికి కట్టబెట్టాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నా ఇళ్లు నా సొంతం కార్యక్రమంతో భయపడి ప్రభుత్వం డిసెంబరులో ఇళ్లు ఇస్తామని ప్రకటించిందన్నారు. పేదలకు ఇళ్లు నిర్మించి 10 లక్షల రూపాయల ఆస్తి అందించేందుకు తెదేపా శ్రీకారం చూడితే వైకాపా వాటిని మురికి కూపాలకుగా మార్చారని మండిపడ్డారు.
ఆధారాలు ఇచ్చేందుకు సిద్ధం
ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో ఎమ్మెల్యేలు లక్ష రూపాయల వరకు డబ్బులు వసూలు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ని గ్యాంబిలింగ్ కేంద్రంగా మారుస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం ఇచ్చే సెంటు భూమిలో ఇల్లు ఎలా కట్టుకుంటారని నిలదీశారు. ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో 4 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నరేగా నిధుల్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తే ఆధారాలు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నమన్నారు. ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో జరిగిన అవినీతిపై కడుపు కాలిన వాళ్లు కోర్టుకు వెళితే తమపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయ జీవితం ఇచ్చింది తెదేపానే