అమరావతి రాజధాని రైతులకు సంఘీభావంగా నందిగామలో 20 మంది నిరసనదీక్ష చేశామని కార్యకర్తలు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. అప్పటి నుంచి వైకాపా నేతలు, పోలీసులు తమపై కక్ష గట్టారని వారు తెలిపారు.
అమరావతి పరిరక్షణ సమితికి ప్రవాసాంధ్రులు కోనేరు ఉమా మహేశ్వరరావు, శారద దంపతులు 50 వేల రూపాయల విరాళాన్ని అందజేశారు. అనంతరం ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబును కలసి రాజధాని తరలింపు నిర్ణయంపై వ్యతిరేకతను, ఆవేదనను వ్యక్తం చేశారు.
బాపట్ల నియోజకవర్గ తెదేపా నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జిగా నియమించినందుకు నరేంద్రవర్మ చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. బాపట్లలో తెదేపాకు పూర్వ వైభవం తెచ్చేందుకు అందరితో కలిసిమెలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, వార్డుల్లో ప్రజాచైతన్య యాత్ర నిర్వహించాలని చంద్రబాబు సూచించారు.