ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమరావతిపై రెఫరెండానికి రెడీ..ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటా: చంద్రబాబు

అమరావతి అంశంపై రెఫరెండానికి వెళదామని...ముఖ్యమంత్రి గెలిస్తే.. తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. దీనిపై 45రోజుల్లో తేల్చుకుందామని.. ముఖ్యమంత్రి సిద్ధమా అని సవాలు చేశారు. అమరావతి రాజధాని ఉద్యమం ఏడాది పూర్తైన సందర్భంగా అమరావతి జేఏసీ నిర్వహిస్తున్న జనభేరి సభలో చంద్రబాబు పాల్గొన్నారు.

అమరావతిపై రిఫరెండానికి వెళదాం..ఓడితే  రాజకీయాల నుంచి తప్పుకుంటా: చంద్రబాబు సవాల్
అమరావతిపై రిఫరెండానికి వెళదాం..ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటా: చంద్రబాబు సవాల్

By

Published : Dec 17, 2020, 3:46 PM IST

Updated : Dec 17, 2020, 10:01 PM IST

అమరావతిపై రెఫరెండానికి రెడీ..ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటా: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్​కు ప్రజారాజధానిగా అమరావతే కొనసాగాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. అమరావతిని నాశనం చేస్తూ.. మూడు రాజధానులు అంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ప్రజల్లోకి వెళదామని చంద్రబాబు అన్నారు. అమరావతి రెఫరెండంలో.. మూడు రాజధానులు కావాలనుకుంటే... తాను శాశ్వతంగా రాజకీయాలను వదిలేస్తానని చంద్రబాబు ప్రకటించారు. దీనికి ముఖ్యమంత్రి సిద్ధమా అని సవాలు చేశారు.

వైకాపా వినాశనం తప్పదు..

అమరావతి ఆడపడచుల ఆగ్రహ జ్వాలకు వైకాపా నామరూపాలు లేకుండా పోతుందని..తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ద్రౌపదిని అవమానించిన దుర్యోధనుడి సామ్రాజ్యం కూలిపోయిందని.. అమరావతి ఉద్యమం చేస్తున్న మహిళలను అవమానించిన వైకాపాకూ అదే గతి పడుతుందని అన్నారు. అమరావతి రైతులు సాగిస్తున్న పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు.. తమకు జరిగిన అన్యాయంపై పోరాడుతున్న రైతులు, మహిళలను ఈ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారులని ముద్ర వేస్తోందని ధ్వజమెత్తారు.

దుర్గమ్మ చూస్తోంది...

ఈ ప్రభుత్వ అరాచకాలను బెజవాడ కనకదుర్గమ్మ చూస్తోందని చంద్రబాబు అన్నారు. అమరావతి రైతులపై జరుపుతున్న దాష్టీకంపై దుర్గమ్మ మూడోకన్ను తెరుస్తుందని .. ఈ ప్రభుత్వం కనిపించకుండా పోతుందన్నారు.

కులముద్ర వేస్తారా..?

"ఒక సామాజిక వర్గంలో పుట్టడం నా తప్పా..? " అని చంద్రబాబు ప్రశ్నించారు. అమరావతి ఉద్యమంలో దళితులు, బలహీనవర్గాలు, అగ్రవర్ణాలు కులాలు, మతాలకు అతీతంగా పోరాటం చేస్తుంటే అమరావతిపై కులముద్ర వేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా అమరావతిలో ఉద్యమం చేస్తున్నది ఎవరో వచ్చి చూడాలన్నారు.

వన్ టైమ్ సీఎం

ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి వన్ టైమ్ సీఎం అని.. ఆయన మళ్లీ గెలిచే అవకాశం లేదన్నారు. ఒక్క అవకాశం అని ప్రజలను మోసం చేసిన జగన్ ... అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అని మరో మోసానికి తెరతీశారని ఆరోపించారు. అమరావతిలో అవినీతి జరిగిందని ఆరోపణలు చేశారని.. ఇన్​సైడర్ ట్రేడింగ్​లో కొండను తవ్వి ఎలుకను కూడా పట్టుకోలేకపోయారన్నారు. రాజధాని ఉద్యమానికి వ్యతిరేకంగా పేటీఎం బ్యాచ్​తో 3 రాజధానుల ఉద్యమం చేయిస్తున్నారని ... ఎస్సీలపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు పెట్టిన ప్రభుత్వం చరిత్రలో ఇదొక్కటే అన్నారు.

సీఎం ఇంట్లో మర్డర్లు

ముఖ్యమంత్రి సొంత కుటుంబంలోనే హత్యలు జరుగుతాయి.. దానిపై దర్యాప్తు ఏంటో తెలీదు. సాక్షులు మాత్రం అనుమానాస్పద రీతిలో చనిపోతుంటారు. వారింట్లో మాత్రమే అలా జరుగుతుందన్నారు. ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి హోల్ సేల్​గా ..మంత్రులు రీటైల్​గా దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.

అమరావతి గెలుస్తుంది...

ఎన్నిఅడ్డంకులు ఎదురైనా అమరావతి రైతులు.. గొప్ప పోరాటాన్ని సాగిస్తున్నారని.. పోరాడే వారి సంఖ్య మరింత పెరిగితేనే ప్రభుత్వం దిగి వస్తుందని అన్నారు. ప్రజాచైతన్యం ముందు అధికారం నిలవదని చెప్పారు. మూడు రాజధానుల ప్రకటన విరమించుకుని... అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:పోలీసుల హైడ్రామా మధ్య జనభేరి సభకు చంద్రబాబు!

Last Updated : Dec 17, 2020, 10:01 PM IST

ABOUT THE AUTHOR

...view details