దళిత నియోజకవర్గాల మధ్య రాజధాని ఉండరాదని... సీఎం జగన్ అమరావతిని తరలించే కుట్రలు పన్నుతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలు చేస్తున్నారా లేక పులివెందుల రాజ్యాంగం అమలవుతోందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఎస్సీ నాయకులతో చంద్రబాబు ఆన్‌లైన్ ద్వారా సమావేశమయ్యారు. దళితుల భూములు లాక్కుంటూ ఇళ్లు కూల్చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ అరాచకాలకు తగిన మూల్యం చెల్లించక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. దళిత నాయకత్వం ఎదిగే అవకాశం ఇదేనని... వైకాపా వేధింపులను ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. దళితులంతా కలిసికట్టుగా పనిచేసి రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం పోరాడాలన్నారు. సమాజంలో యువ నాయకత్వం ఎదిగి రావాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో పులివెందుల రాజ్యాంగమా? : చంద్రబాబు - cm jagan latest news
దళిత నియోజకవర్గాల మధ్య రాజధాని ఉండరాదని... సీఎం జగన్ అమరావతిని తరలించే కుట్రలు పన్నుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పార్టీ ఎస్సీ నాయకులతో చంద్రబాబు ఆన్‌లైన్ ద్వారా సమావేశమయ్యారు. దళితులంతా కలిసికట్టుగా పనిచేసి రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం పోరాడాలన్నారు.
సీఎం జగన్పై మండిపడ్డ చంద్రబాబు