ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజధాని రైతులతో ప్రభుత్వ తీరు దుర్మార్గం: చంద్రబాబు - amaravathi farmers

రాజధాని రైతుల అరెస్టును తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. అణిచివేత ధోరణితో రైతులను భయపెట్టాలని చూడటం నిరంకుశత్వానికి నిదర్శనమని మండిపడ్డారు.

chandrababu
chandrababu

By

Published : Aug 26, 2020, 4:57 PM IST

రాజధాని రైతుల అరెస్టును తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. కౌలు డబ్బుల కోసం సీఆర్డీఏ కార్యాలయానికి శాంతియుతంగా వెళ్తున్న రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు దుర్మార్గమని మండిపడ్డారు.

రైతులను లాగి, కఠినంగా వ్యాన్లలోకి విసిరారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విధంగా ప్రవర్తించటం ఏంటని ప్రశ్నించారు. అణిచివేత ధోరణితో రైతులను భయపెట్టాలని చూడటం నిరంకుశత్వానికి నిదర్శనమని దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details