వైకాపా ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తప్పుడు ప్రచారంతో బీసీలను తెదేపాకు దూరం చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వర్సిటీలు, తితిదే బోర్డులలో బీసీలకు అన్యాయం జరిగిందని అన్నందుకే ఇందతా చేస్తున్నారని అన్నారు. బీసీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత తమదేనని స్పష్టం చేశారు. దుష్ప్రచారంతో తమ పార్టీని బీసీలకు దూరం చేయలేరని వ్యాఖ్యానించారు.
అసత్యాలతో తెదేపాకు బీసీలను దూరం చేసే కుట్ర: చంద్రబాబు - ఏపీలో బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు
తప్పుడు ప్రచారంతో బీసీలను తెదేపాకు దూరం చేసే కుట్రకు వైకాపా నేతలు తెరలేపారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా...తమ పార్టీని బీసీలకు దూరం చేయలేరని స్పష్టం చేశారు.

CBN on BCs