ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఓటమి భయంతోనే వైకాపా బెదిరింపులకు పాల్పడుతోంది: చంద్రబాబు - chandrababu on panchayat elections 2021

ఓటమి భయంతోనే పంచాయతీ ఎన్నికల్లో వైకాపా... బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. వైకాపా నేతలు కొందరు పోలీసులతో కుమ్మక్కై... బలవంతపు ఏకగ్రీవాలు జరిపించేందుకు చూస్తున్నారని ఆరోపించారు. తొలి దశ నామినేషన్లకు ఇవాళే ఆఖరు అయినందున అన్ని పంచాయతీల్లో నామినేషన్లు వేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

వైకాపాపై చంద్రబాబు ఫైర్
chandrababu fiers on ycp

By

Published : Jan 31, 2021, 3:33 AM IST

తొలి దశ పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతాల తెలుగుదేశం నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం రవాణా చేస్తూ...... గ్రామాల్లో ఏరులై పారిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో తక్షణమే మద్యం విక్రయాలు ఆపేయాలని డిమాండ్ చేశారు. వైకాపా నేతలు అక్రమ కేసులు పెట్టే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని కోరారు. గ్రామాల్లో భూములు, ఖనిజ సంపద, సహజవనరుల దోపిడీ కోసమే వైకాపా నేతలు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

ప్రలోభాలకు గురిచేసి... వేలం పాటలు పెట్టి ఎన్నికలు జరగకుండా పన్నాగాలు పన్నుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. బైండోవర్ కేసుల్లో తమ పార్టీవారిపై కక్ష సాధిస్తూ కొందరు పోలీసులు వైకాపా వారిని స్వేచ్ఛగా వదిలేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఏ కేసూ లేనివారిని సైతం... స్టేషన్‌కు పిలిపించి బెదిరిస్తున్నారని ఆగ్రహించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ఆర్డీవోకు సమాచారం ఇవ్వడం, నోటీసులు అందించడం వంటివి లేకుండానే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు.

జగన్ పీనల్ కోడ్​ గా మార్చి....

ఇండియన్‌ పీనల్ కోడ్‌ని జగన్‌ పీనల్‌ కోడ్‌గా మార్చి రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా తెచ్చిన నల్లచట్టం ముసుగులో తప్పుడు కేసులు బనాయించాలని చూస్తున్నారని విమర్శించారు. తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలను సహించేది లేదన్నారు. కొందరు పోలీసులు..... పోస్టింగుల కోసం ప్రలోభాలకు గురై..... వైకాపా నాయకుల చేతిలో కీలుబొమ్మలుగా మారారని ఆరోపించారు. కొందరు అభ్యర్థులపై తప్పుడు కేసులు పెట్టి స్టేషన్లకు పిలిపించి బెదిరిస్తున్నారని..... వారి బంధువులనూ వేధిస్తున్నారని మండిపడ్డారు. అధికార బలంతో వైకాపా నేతలు వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్నారని.... ఈ అరాచకాలు భరించలేకే పలువురు నాయకులు తెదేపాలో చేరుతున్నారన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో జరిగిన విధ్వంసాలు, తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలు, భౌతిక దాడులు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలని శ్రేణులకు చంద్రబాబు సూచించారు.

పర్చూరు నియోజకవర్గం పెదగంజాం సర్పంచి అభ్యర్థి తిరుపతిరావు అపహరణను చంద్రబాబు ఖండించారు. ఏమిటీ ఆటవిక సంస్కృతి? అని ప్రశ్నించారు. ప్రత్యర్థులు పోటీకి నిలబడితే ప్రజల తీర్పు ఎలా ఉంటుందో అని వైకాపా నేతలు భయపడుతున్నారనడానికి ఇది నిదర్శనమన్నారు. నామినేషన్‌ వేసే అభ్యర్థికి కనీస రక్షణ కల్పించలేకపోవడం..... రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత ప్రమాదకర స్థితిలో ఉన్నాయో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. అపహరణకు కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న చంద్రబాబు.. ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్న చోట్ల ఏకగ్రీవ ఎన్నికను రద్దుచేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

'తీవ్ర పరిణామాలు తప్పవు'... సీఎస్​కు ఎస్​ఈసీ నిమ్మగడ్డ హెచ్చరిక

ABOUT THE AUTHOR

...view details