చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని.. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. మళ్లీ 5 సూత్రాలంటూ చంద్రబాబు ముందుకు వస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పన్నులు జీవో 159 జారీ చేశారన్న బొత్స... అప్పట్లో 33.3 శాతం పన్నులను పెంచుతూ జీవో ఇచ్చారని గుర్తుచేశారు. ప్రస్తుతం ఇంటిపై ఆదాయం ఆధారంగా ఇంటిపన్ను వేస్తున్నారని మంత్రి బొత్స స్పష్టం చేశారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారమే ముందుకెళ్తున్నామని వివరించారు. ప్రజల అభిప్రాయాలు తీసుకున్నాకే పన్ను పెంచుతూ చట్టం చేశామని చెప్పారు.
చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు: బొత్స - botsa
తెదేపా అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు చేశారు. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. ప్రస్తుతం ఇంటిపై ఆదాయం ఆధారంగా ఇంటిపన్ను వేస్తున్నారని మంత్రి బొత్స స్పష్టం చేశారు.
మంత్రి బొత్స సత్యనారాయణ